Movies

హారర్‌ చిత్రంతో వచ్చేందుకు సిద్ధమవుతున్న సోనియా అగర్వాల్‌

హారర్‌ చిత్రంతో వచ్చేందుకు సిద్ధమవుతున్న సోనియా అగర్వాల్‌

‘7/జి బృందావన కాలని’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది కథానాయిక సోనియా అగర్వాల్‌. ‘టెంపర్‌’, ‘విన్నర్‌’, ‘రెడ్‌’ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె ముఖ్యభూమిక పోషించిన ‘7/జి’ అనే తమిళ హారర్‌ చిత్రంతో వచ్చేందుకు సిద్ధమవుతోంది. ది డార్క్‌ స్టోరీ..అనేది ఉపశీర్షిక. హరూన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్‌ విపిన్‌, స్మృతి వెంకట్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ కథానాయకుడు విజయ్‌ సేతుపతి సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. కోపంతో ఉన్న సోనియా…భయపడుతూ కనిపిస్తున్న స్మృతి..ఇలా కొత్తగా ఉన్న ఆ లుక్‌ ఆసక్తి కలిగిస్తోంది. హారర్‌ థ్రిల్లర్‌గా భయపెట్టేందుకు రానున్న ఈ సినిమాలో సోనియా తల్లి పాత్రలో కనిపించనుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z