విద్య పేరుతో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్న బైజూస్‌ను రాష్ట్రంలో నిషేధించాలంటూ గుంటూరులో పలు విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసనకు దిగారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బైజూస్, ఆకాశ్ శిక్షణ కేంద్రాల వద్ద ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి షేక్ వలీ మాట్లాడుతూ అర్థం కాని చదువులతో విద్యార్థుల జీవితాలను బైజూస్ నాశనం చేస్తోందని విమర్శించారు. ట్యాబ్‌ల పంపిణీలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న అరండల్‌పేట పోలీసులు ఆందోళనకారులపై దురుసుగా ప్రవర్తించారు. వారిని ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు.
👉 – Please join our whatsapp channel here –