మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మేడ్చల్‌లో ఆటో డ్రైవర్లు RTC బస్సుల్లో బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఫ్రీ బస్సులతో మా పొట్ట కొట్టొద్దంటూ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు నిరసన కార్యక్రమాల రూపంలో ప్రభత్వానికి విన్నవించుకున్నారు. ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి ఆటోలకు గిరాకీ తగ్గిందని, ఇలా అయితే తమ కుటుంబాల పోషణ కష్టంగా మరుతుందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఒక ఎత్తైతే… ఫ్రీ బస్సులతో మరో రకమైన తల నొప్పి కూడా మొదలైంది. ప్రయాణం ఉచితం కావడంతో అవసరం ఉన్నా లేకపోయినా, పని చిన్నదైనా, పెద్దదైనా మహిళలు ఆర్టీసీ బస్సులెక్కుతున్నారు. దీంతో బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. పురుషులకు నిలబడటానికి కూడా జాగా లేకుండా పోతుంది. దీనికి తోడు బస్సులో సీట్లకోసం ఆడోళ్ల పంచాయితీలు, కొట్లాటలతో కండక్టర్, డ్రైవర్లకు తలనొప్పిగా మారింది. ఇదేం గోసరా బాబూ అంటున్నారు. చూడాలి ఈ ఫ్రీ బస్సు మానియా ఇంకెన్నాళ్లుంటుందో.
👉 – Please join our whatsapp channel here –