మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రం ఈగల్. కావ్య థాపర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. కానీ సంక్రాంతికి ఇప్పటికే నాలుగైదు సినిమాలో రంగంలోకి దిగాయి. వాటిమధ్యే తీవ్ర పోటీ ఉంది. ఈ తరుణంలో ఈగల్‌ను రిలీజ్ చేస్తే సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడటం ఖాయం!
అందుకని చిత్రయూనిట్ వెనకడుగు వేసింది. జనవరి 13న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం ఓ అడుగు వెనక్కు వేస్తున్నాం.. అంటూ రవితేజ ఎక్స్(ట్విటర్)లో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఇది చూసిన రవితేజ అభిమానులు.. మీరు గ్రేట్ అన్నా.. మీ మనసు బంగారం అని కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం ప్రతిసారి మీరే పెద్ద మనసు చేసుకుని తప్పుకుంటున్నారు.. ఈగల్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం.. అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –