గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’ (Game On). ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించింది. నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నటీనటులకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తామని తెలిపారు.
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలోని ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి, రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌ను ఎంచుకోవడానికి కారణం ఏమిటి? ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకులకు ఇది విభిన్నమైన అనుభూతిని అందిస్తుంది’’ అని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –