బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవుతున్నాయి. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సీడెడ్ గడ్డ బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల ధాటికి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతోంది. ఇలాంటి సమాయంతో మెగాస్టార్ చిరంజీవి, బీగోపాల్ కలిసి చేసిన సినిమా ‘ఇంద్ర’. చిరుతో వైట్ అండ్ వైట్ వేయించి, మీసం తిప్పించి చేసిన ఈ ఫ్యాక్షన్ సినిమా ఒక యుఫోరియానే క్రియేట్ చేసింది. అశ్వనీదత్ ప్రొడ్యూసర్ గా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 2002 జూలై 24న విడుదలైయ్యింది ఇంద్ర సినిమా. ఈ సినిమా సక్సస్ మీట్ జరిగిన రేంజ్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.
“భం భం బోలే…”, “ఘల్లు ఘల్లుమని…”, “దాయి దాయి దామ్మా…”, “రాధే గోవిందా…”, “అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో….”, “అమ్మడూ అప్పచ్చి…” సినిమా కన్నా ముందే ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. ఇక థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత మొదటి సీన్ “నేనున్నా నానమ్మ” డైలాగ్ తోనే థియేటర్ టాప్ లేచిపోయేలా అరిచారు మెగా ఫ్యాన్స్. అప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకూ ప్రతి పది నిముషాలు పావు గంటకి పర్ఫెక్ట్ మాస్ స్టఫ్ ఇస్తూ ఇంద్ర సినిమా సాగింది. ఇంద్రసేనా రెడ్డిగా చిరు చెప్పిన డైలాగులు, చేసిన ఫైట్లు మెగా అభిమానులకి పూనకాలు తెప్పించాయి. దీంతో ఇంద్ర సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది. 122 కేంద్రాలలో శతదినోత్సవం , 32 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకొని అప్పట్లో రికార్డుగా నిలచింది. ఆదోని సత్యం థియేటర్ లో 247 రోజులు ప్రదర్శితమైంది.
ఈ సినిమా ద్వారా చిరంజీవికి ఉత్తమనటునిగా నంది అవార్డు లభించింది. అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్ గా లారెన్స్ కు, బెస్ట్ డబ్బింగ్ మేల్ ఆర్టిస్ట్ గా రవిశంకర్ కు నంది అవార్డులు దక్కాయి. కమర్షియల్ సినిమాల్లో, చిరు కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లాంటి ఇంద్ర సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ సీనియర్ ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో 1974లో స్టార్ట్ అయ్యింది. ఈ ఏడాదితో వైజయంతి మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్లు అయిన సంధర్భంగా ఇంద్ర సినిమాని గ్రాండ్ గా రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ రీరిలీజుల్లో కొత్త హిస్టరీ క్రియేట్ చేయడం గ్యారెంటీ.
👉 – Please join our whatsapp channel here –