ScienceAndTech

ఇస్రో చీఫ్‌కి డాక్టరేట్

ఇస్రో చీఫ్‌కి డాక్టరేట్

అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఆకాంక్షించారు. తెలంగాణలోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను వీసీ ప్రొ.కట్టా నరసింహారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడుతూ.. ‘‘వర్సిటీలతో కలిసి పనిచేయడంపై వీసీతో చర్చించా. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేసేందుకు కృషి చేస్తున్నాం. చంద్రయాన్‌ – 3 దేశం మొత్తం గర్వించేలా చేసింది. పరాజయాలు అధిగమించి 3 ప్రాజెక్టుల్లో విజయం సాధించాం. నా జీవితంలో రాకెట్‌ రూపకల్పనలో నేనూ ఎన్నో తప్పులు చేశా. అపజయం గెలుపునకు పాఠం లాంటింది’’ అని చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z