Politics

రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కేశినేని

రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన కేశినేని

తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు. ‘‘అందరికీ నమస్కారం. తెదేపాకు నా అవసరం లేదని అధినేత చంద్రబాబు భావించిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్‌ కాదని నా భావన. కాబట్టి త్వరలోనే దిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. దాన్ని ఆమోదించిన మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా’’ అని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z