తెలంగాణ ఆర్టీసీ (TS RTC) కి ప్రయాణికులతో పాటు కార్మికులు కూడా రెండు కళ్లలాంటి వారని, త్వరలో ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామని సంస్థ వీసీ ఎండీ సజ్జనార్( Sajjanar) పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ బస్సు డిపోలో నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ(Maha laxmi) పథకంలో భాగంగా ఇప్పటివరకు ఏడు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారని వివరించారు. విధి నిర్వహణలో కార్మికులను ప్రోత్సహించడం ద్వారా సంస్థ అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులందరూ కష్టపడి పనిచేయడం వల్లనే ఆర్టీసీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.
విధి నిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనే ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలిగించాలనే ఉద్దేశంతో వన భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందికి నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ కృష్ణకాంత్, ఆర్ఎం వరప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –