Politics

UPSC ఛైర్మన్‌తో రేవంత్ సమావేశం

UPSC ఛైర్మన్‌తో రేవంత్ సమావేశం

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్ సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. రేవంత్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి , మరో ఇద్దరు ఐఏఎస్ లు ఉన్నారు. UPSC పనితీరు పరిశీలన, పరీక్షల నిర్వహణతో పాటు ఇతర అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలిసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అధికారంలోకి రాగానే టీఎస్ పీఎస్ సీని ప్రక్షాళన చేస్తామన్న రేవంత్..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ పీఎస్ సీ బోర్డులోని చాలా మంది అధికారులు రాజీనామా చేశారు. కేరళలో ఇప్పటికే పర్యటించి…అక్కడి సర్వీస్ కమిషన్ పనితీరును పరిశీలించింది IASల బృందం. ఈ క్రమంలోనే యూపీఎస్సీ ఛైర్మన్ తో చర్చిస్తున్నట్లు సమాచారం

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z