కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మ్యూజియంలో బాంబును అమర్చినట్లు ఈమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సందర్శకులందర్ని మ్యూజియం నుంచి ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలను మ్యూజియానికి పంపించారు.
బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు బూటకమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి అలాంటి మెయిల్స్ కొన్ని వచ్చాయని వెల్లడించారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు దుండగులు మెయిల్‌లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.
ఇటీవల దేశంలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఎక్కువైంది. దేశరాజధానిలో ఇటీవల ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద బాంబు బెదిరింపుల ఘటన జరిగింది. అటు.. ముంబయిలోనూ ఆర్‌బీఐ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే అయోధ్య రామాలయం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –