మహాలక్ష్మి పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసులు ఎంతోమంది మహిళల పాలిట వరంగా మారింది. ఉచిత బస్సు సర్వీసును ఉపయోగించుకొని చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. గతంలో అనారోగ్య సమస్య తలెత్తితే అంతదూరం నుంచి నగరంలోని ఆసుపత్రులకు రాలేక స్థానికంగా చికిత్స చేయించుకొనేవారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఉచితమే అయినా బస్సుల ఛార్జీల భారంతో వెళ్లేవారు కాదు. ఇప్పుడా పరిస్థితి మారింది. స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ 15 రోజులపాటు చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సర్వేలో పాల్గొన్న మహిళల సంఖ్య: 3530
ఏఏ ఆసుపత్రులు- ఉస్మానియా, గాంధీ, పీట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి, నిమ్స్, కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి, మలక్‌పేట ఏరియా ఆసుపత్రి, బార్కస్ పీహెచ్‌సీ, బాలాపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్
ఉచిత బస్సు లేక ముందు మొత్తం రోగుల్లో మహిళల శాతం: 52 శాతం
ఉచిత బస్సు తర్వాత అదనంగా పెరిగిన మహిళలు: 31 శాతం
ఇందులో ఉచిత బస్సులో ఆసుపత్రులకు వచ్చే వారు: 15 శాతం
ఓపీడీ సేవలు వినియోగం: 71 శాతం
యాంటినెంటల్ కేర్: 18 శాతం
ఇతర ఆరోగ్యసేవలు: 11 శాతం
రెండు వైపులా బస్సు సేవలు వాడుకునే వారు: 70 శాతం
ఒకవైపు మాత్రమే ఉచిత బస్సు వాడుకునే వారు: 30 శాతం
25 కిలోమీటర్ల అంతకంటే దూరం నుంచి వచ్చే వారు: 33 శాతం
వేయి వరకు ఛార్జీలు ఆదా చేసుకునే వారు: 35 శాతం
500-1000 వరకు ఆదా చేసుకునే వారు: 52 శాతం
ఆదా చేసే మొత్తం స్కూల్ ఫీజుల కోసం ఖర్చు చేస్తున్నవారు: 60 శాతం
మంచి ఆహారం కోసం ఖర్చు చేస్తున్నట్లు చెప్పినవారు: 28 శాతం
👉 – Please join our whatsapp channel here –