DailyDose

గురుకుల కళాశాల ప్రవేశాలకు గడువు పెంపు

గురుకుల కళాశాల ప్రవేశాలకు గడువు పెంపు

వచ్చే విద్యాసంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు వీటీజీ సెట్‌ కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 11న రాతపరీక్ష నిర్వహించి, మెరిట్‌, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు. వివరాలకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 45678, www.tgcet.cgg. gov.in, http://www.tgcet.cgg.gov. inను సంప్రదించాలని సూచించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z