DailyDose

రేసింగ్ అభిమానులకు షాక్

రేసింగ్ అభిమానులకు షాక్

భాగ్యనగరం (Hyderabad News) వేదికగా జరగాల్సిన ఫార్ములా-ఈ కార్ల రేస్‌ (Formula-E race) రద్దు అయ్యింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈ-ప్రిక్స్ రౌండ్‌ను విరమించుకుంటున్నట్లు ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ (FIA) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వం నుంచి స్పష్ణమైన నిర్ణయం రాకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. గత ప్రభుత్వంతో రేసు నిర్వహణ కోసం అక్టోబర్ 23న చేసుకున్న ఒప్పందాన్ని.. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ శాఖ రద్దు చేసినట్లు తెలిపింది. ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖపై చట్టపరమైన చర్యల కోసం నోటీసులు జారీ చేస్తామని పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z