సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రైల్వే స్టేషన్ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు టైమ్‌టేబుల్ వారీగా రైళ్లు నడుస్తాయన్నారు. సికింద్రాబాద్- బరంపురం, హైదరాబాద్- బరంపురం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.
మరో రెండు ప్రత్యేక రైళ్లు..
అదేవిధంగా.. నర్సాపూర్- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య, ఈ నెల 10, 11 తేదీల్లో ఈ రెండు రైళ్లు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
విద్యుద్ధీకరణ పనులు పూర్తి..
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో గిద్దలూరు- జగ్గంబొట్ల కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్య విద్యుద్ధీకరణతో పాటు రెండో రైల్వే లైన్ పనులు పూర్తి కావడంతో వాటిని శుక్రవారం ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు- గుంతకల్ డబ్లింగ్, విద్యుద్ధీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 26.4 కిలోమీటర్ల మేరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు 2016- 17లో రూ.3,887 కోట్ల అంచనా వ్యయంతో 401 కిలోమీటర్ల దూరం కోసం నిధులు మంజూరయ్యాయన్నారు.
👉 – Please join our whatsapp channel here –