గతేడాది తెరపై కనిపించలేదు శర్వానంద్. పెళ్లి పనులు, సెట్స్‌పై ఉన్న ఓ సినిమాకే తన సమయాన్ని కేటాయించారు. ఈ ఏడాదిలో ఆయన రెండు సినిమాలతోనైనా సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం దాదాపు చివరి దశకు చేరుకుంది. మరోవైపు కొన్ని కొత్త చిత్రాల్ని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ‘మ్యాడ్’తో విజయాన్ని అందుకున్న కల్యాణ్‌శంకర్ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో శర్వాకి జోడీగా రెబా మోనికా జాన్ ఎంపికైనట్టు సమాచారం. గతేడాది ‘సామజవరగమన’ చిత్రంతో విజయాన్ని అందుకున్న నాయిక రెబా. ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలోనూ శర్వానంద్ నటించేందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –