పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీంలోని రిజర్వాయర్ల కింద కాల్వలతో పాటు వికారాబాద్‌జిల్లాలో ప్రాజెక్టు విస్తరణ పనులకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆదివారమే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. లేదంటే వారం రోజుల్లోపే రూ.7 కోట్ల విలువైన పనులను రద్దు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ప్రభుత్వం హడావుడిగా ఈ టెండర్లు పిలవడం, అన్ని పనులను నిర్దేశిత మొత్తానికన్నా ఎక్కువకే కాంట్రాక్టర్లు దక్కించుకోవడంతో వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ప్రభుత్వం హడావుడిగా ఈ టెండర్లు పిలవడం, అన్ని పనులను నిర్దేశిత మొత్తానికన్నా ఎక్కువకే కాంట్రాక్టర్లు దక్కించుకోవడంతో వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తానికి మొత్తం పనులను రద్దు చేసి కొత్తగా టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. ఆదివారం ఈ మేరకు సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహించనున్నారు. టెండర్లను రద్దు చేస్తూ ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. వీటితో పాటు అచ్చంపేట నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చే ఉమా మహేశ్వర ఎత్తిపోతల స్కీం టెండర్‌ను కూడా రద్దు చేయనున్నట్టు తెలిసింది.
నాలుగు శాతానికి పైగా ఎక్సెస్‌తో..
పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్స్కీంలో ఉద్దండాపూర్, కర్వెన రిజర్వాయర్ల కింద ప్రధాన కాల్వలతో పాటు ఏడు పనులు చేపట్టేందుకు రూ.3,747.49 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ పనుల టెండర్లను వర్క్ ఏజెన్సీలు నాలుగు శాతానికి పైగా ఎక్సెస్‌కు దక్కించుకున్నాయి. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 10 కి.మీ.ల వరకు 6.50 కి.మీ మేర టన్నెల్, 3.5 కిలోమీటర్ల మేర కాల్వ పనులకు రూ.528.30 కోట్లతో టెండర్లు పిలువగా.. 4.15 శాతం ఎక్సెస్‌కు సరళ – ఏవీఆర్ సంస్థపనులు దక్కించుకుంది. ఇదే రిజర్వాయర్ రైట్ మెయిన్ కెనాల్ పనులకు రూ.711 కోట్లతో టెండర్లు పిలువగా.. 4.5 శాతం ఎక్సెస్ కోట్ చేసి మేఘా ఇంజనీరింగ్ సంస్థ పనులు దక్కించుకుంది. ఇదే రిజర్వాయర్కింద 15.5. కి.మీ.ల నుంచి 48.3 కి.మీ.ల వరకు కాల్వ పనులకు రూ.747.58 కోట్లతో టెండర్లు పిలువగా 4.5 శాతం ఎక్సెస్‌కు కావేరి సంస్థ పనులు దక్కించుకుంది. 48.3 కి.మీ.ల నుంచి 81.2 కి.మీ.ల వరకు కాల్వ తవ్వకానికి రూ.585 కోట్లతో టెండర్లు పిలువగా 4.6 శాతం ఎక్సెస్‌కు మేఘా ఇంజనీరింగ్పనులు దక్కించుకుంది. ఇదేరిజర్వాయర్ లెఫ్ట్మెయిన్కెనాల్లో 71.12 కి.మీ.ల నుంచి 122.3 కి.మీల. వరకు కాల్వ పనులకు రూ.314 కోట్లతో టెండర్లు పిలువగా 4.2 శాతం ఎక్సెస్‌కు కేఎన్ఆర్ కన్స్‌స్ట్రక్షన్స్ పనులు దక్కించుకుంది. కరివెన రిజర్వాయర్‌నుంచి 33.1 కి.మీ.ల వరకు కాల్వ తవ్వకానికి రూ.387.82 కోట్లతో టెండర్పిలువగా 4.1 శాతం ఎక్సెస్‌కు కేఎన్ఆర్ కన్స్‌స్ట్రక్షన్స్ టెండర్ దక్కించుకుది. ఇదే రిజర్వాయర్ కింద 33.1 కి.మీ.ల నుంచి 113.55 కి.మీ.ల వరకు కాల్వ తవ్వకానికి రూ.473.79 కోట్లతో టెండర్లు పిలువగా 4.15 శాతం ఎక్సెస్‌కు కోట్‌చేసి వీఏఆర్ కేఎస్ సంస్థ టెండర్ దక్కించుకుంది. గతేడాది ఆగస్టు 9న రూ.1,061.39 కోట్లతో అచ్చంపేట (ఉమామహేశ్వర) లిఫ్ట్ స్కీం పనులకు టెండర్లు పిలువగా ఆ పనులను వర్క్ఏజెన్సీ ఎక్సెస్‌కే దక్కించుకుంది. వికారాబాద్ జిల్లాలోని చేవెళ్ల, పరిగి, కొడంగల్, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాలకు పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్స్కీంలో భాగంగా పలు పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనులను కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏయే పనులు రద్దు చేయబోతున్నారనే దానిపై అధికారికంగా త్వరలోనే ప్రకటన చేయనున్నారు.
👉 – Please join our whatsapp channel here –