Politics

హైదరాబాద్‌ తరహాలో రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తాం!

హైదరాబాద్‌ తరహాలో రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తాం!

తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ – ఆర్ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్‌ క్లస్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ప్రాంతమంతా రూరల్‌ క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. బల్క్‌ డ్రగ్‌ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్‌ ప్రతినిధులతో శనివారం సీఎం సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘పెట్టుబడులు ఆహ్వానించేలా ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అమలు చేస్తాం. హైదరాబాద్‌ తరహాలో రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తాం. అన్నిరంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తాం. కొత్తగా ఫార్మా విలేజీలు నిర్మిస్తాం. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలి. సుదీర్ఘ లక్ష్యంతో మెగా మాస్టర్‌ పాలసీ రూపకల్పన చేస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారి ప్రతి పైసాకు రక్షణ కల్పిస్తాం. పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. అన్ని ప్రాంతాల్లో జరగాలి. పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలి’’ అని సీఎం వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z