రాజధాని నిర్మాణ సామగ్రిని గుత్తేదారు సంస్థ తరలిస్తుండటంతో రాజధాని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. శనివారం రాజధాని భూముల్లోని తాగునీటి పైపులను కొందరు వ్యక్తులు లారీల్లో తరలించారు. అమరావతి నిర్మాణానికి గత ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. బృహత్ ప్రణాళికను తయారుచేసి విశాలమైన రహదారులు, అండర్ గ్రౌండ్ విధానంలో తాగునీరు, విద్యుత్, టెలిఫోన్, మురుగునీటి పారుదల సదుపాయాలను కల్పించేందుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. వైకాపా అధికారం చేపట్టిన తరువాత రాజధాని పనులు నిలిచిపోయాయి. గుత్తేదారు సంస్థ తీసుకొచ్చిన నిర్మాణ సామగ్రి ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి. రాజధాని గ్రామం కురగల్లు వద్ద ఉన్న తాగునీటి పైపులను శనివారం సాయంత్రం పెద్ద లారీల్లో తరలించడం రైతులు గమనించారు. రాజధాని నిర్మాణ గుత్తేదారు సంస్థ మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పైపులను అనంతపురం జిల్లా డోన్‌కు తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్లు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –