UKలోని బ్రాక్నెల్ నగరం “ది పార్క్స్ కమ్యూనిటీ”లో ప్రవాస తెలుగు వారు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పండుగ ప్రాముఖ్యతని, తెలుగు సంప్రదాయాలను వివరిస్తూ వేడుక నిర్వహించారు. చిన్నారులు శ్లోకాలు, భక్తి గీతాలతో అలరించారు. అనంతరం భోగిపళ్లు పోశారు. స్థానిక గోశాల నుండి వారం రోజుల ముందు ఆవుపేడ సేకరించి పిడకలు చేసి భోగిమంటను ఏర్పాటు చేశారు. సహపంక్తి భోజనాలను ఆస్వాదించారు. సరదా ఆటలు నిర్వహించారు. రోజంతా ఉల్లాసంగా-ఉత్సాహంగా గడిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z