నడిచే చెట్లను గురించి విన్నారా?. ఔను! మీరు వింటుంది నిజమే!. చెట్టు నడుస్తాయి అది కూడా సూర్యకాంతిని వెతుక్కుంటూ నడుస్తాయట. అదెలా సాధ్యం అనుకుంటున్నారా. నిజం నడిచేలా వాటి చెట్ల ఆకృతి ఉంటుంది. పైగా అలా నడిస్తే భూమిలో ఉన్న వేరు తెగిపోతుంది లేదా దాంతోపాటు ఎలా కదులుతుంది అనే కదా! ఆ చెట్టు ఎలా నడుస్తుంది? ఎలా కదులుతుందో సవివిరంగా చూద్దాం!.
ఈ రకం చెట్టు దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్లను సక్రాటియా ఎక్సరిజా అంటారు. వాటి మూలాలు సూర్యకాంతి దిశగా పెరుగుతాయి. అందువల ఇవి నడుస్తాయట. ఇవి అచ్చం తాటి చెట్టు మాదిరి ప్రత్యేకమైన చెట్లు. ఏడాదికి సుమారుగా 15 నుంచి 20 మీటర్లు పొడవు పెరుగుతాయని లెక్కించారు శాస్త్రవేత్తలు. దీని వ్యాసం 16 సెం.మీ ఉంటుందని చెప్పారు. వాస్తవానికి తాటి చెట్టు వేళ్లు ఎక్కువగా నేలలోపలికి చొచ్చుకుని ఉంటాయి.
ఈ చెట్లకి మాత్రం వాటి మూలాలు భూమికి వెలుపల చీపురి ఆకృతిలో ఉంటాయి. ఈ ప్రత్యేక రకం తాటి చెట్లు నడుస్తున్నప్పుడు భూమి నుంచి పాత వేర్లు ఊడిపోవడం(నశించిపోవడం) జరుగుతుందట. దీంతో అవి రోజుకి రెండు నుంచి 3 సెం.మీ వరకు నడుస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలా ఏడాది ఈ చెట్టు సుమారు 20 మీటర్లు దూరం నడిస్తాయని అంచనా వేశారు. ఇలాంటి చెట్లు దట్టమైన అడవుల్లో ఉంటాయని చెబుతున్నారు. నిజంగా అత్యంత విచిత్రం కదూ!. సూర్యరశ్మిని అనుసరిస్తూ కదలడం అలా ఏకంగా కొంత దూరం వరకు నడవడం శాస్త్రవేత్తలకు ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉంది.
👉 – Please join our whatsapp channel here –