Politics

నరసింహస్వామి ఆలయంలో లోకేష్ దంపతులు

నరసింహస్వామి ఆలయంలో లోకేష్ దంపతులు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కుటుంబ సమేతంగా సందర్శించారు. తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణ చేసిన అనంతరం పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడ పట్టువస్త్రాలు సమర్పించి వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z