Politics

ఏపీకి వర్ష సూచన

ఏపీకి వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ లో రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని.. దాని ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపింది.

మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడనున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో చలి గాలులు వీస్తున్నాయి. దీంతో ఏపీలో చలి తీవ్రతా పెరిగింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇటీవల తుఫాన్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z