‘ప్రజాపాలన’ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. ‘www.prajapalana.telangana.gov.in’ పేరుతో సిద్ధం చేసిన ఈ వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది రోజుల పాటు ‘అభయహస్తం’ కింద దరఖాస్తులు స్వీకరించింది. ప్రతి 4 నెలలకోసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
👉 – Please join our whatsapp channel here –