తెలంగాణలో నెల రోజుల కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ ప్రస్థానం తనకు తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ‘‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ.. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాటను నిలబెట్టుకుంటూ.. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పేదల గొంతుక వింటూ.. యువత భవితకు దారులు వేస్తూ.. మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ.. రైతుకు భరోసా ఇస్తూ.. సాగిన ఈ నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ.. పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ.. నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ.. మత్తులేని చైతన్య తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో ఈ పాలన బాధ్యతగా సాగింది. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా’’ అని రేవంత్ వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –