ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై కొనసాగుతోన్న సందిగ్ధతకు తెరపడింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలిచ్చారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ముందుగా 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని భావించినా .. స్కూళ్లు, కాలేజీలకు మరో రెండు రోజుల పాటు అదనంగా సెలవులు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం జనవరి 11 నుంచి 21 వరకూ ఇవ్వాలని కోరుతున్నాయి. పండుగ అయిపోయిన వెంటనే పిల్లలు పాఠశాలలకు రారని, అందుకే రెండు రోజులు వెనక్కి ఇచ్చి, జనవరి 22న ప్రారంభించాలని విన్నవించాయి. జనవరి 25న ఆదివారం, జనవరి 26న రిపబ్లిక్ డే రావడంతో మరోసారి వరుస సెలవులు రానున్నాయి. మొత్తంగా చూస్తే జనవరి 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు ఉంటాయి.
👉 – Please join our whatsapp channel here –