Politics

బీసీలకు పాఠశాలల్లో బీజేపీ 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది

బీసీలకు పాఠశాలల్లో బీజేపీ 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది

బీసీ కమిషన్‌ను 102 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి చట్టబద్ధత కల్పించిన ఘనత బీజేపీకే చెందుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. జగన్ పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేశారని, రాష్ట్రంలో బీసీ కమిషన్‌కు ఎందుకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ఆమె ప్రశ్నించారు.

నాలుకకు నరం లేదు కాబట్టి, ఎటుపడితే అటు మడత పెడుతూ తన బీసీలని ఏ హక్కుతో అంటున్నారని పురందేశ్వరి అన్నారు. ఆనాడు బీసీలకు ఎన్టీఆర్ ఎలాంటి న్యాయం చేశారో.. నరేంద్ర మోడీ అదే తరహాలో బీసీలకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నారని ఆమె తెలిపారు. బీసీలకు బీజేపీ పాఠశాల్లో కూడా 27శాతం రిజర్వేషన్ కల్పించిందని పురందేశ్వరి స్పష్టం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z