అమెరికాలోని నార్త్ డకోటాలో బొగ్గు గని కార్మికులకు మంచుయుగం నాటి ఏనుగు(మమూత్) భారీ దంతం లభ్యమైంది. బ్యూలాలోని ఫ్రీడం గనిలో దొరికిన 10,000 ఏళ్లకుపైగా వయసున్న ఈ దంతం 7 అడుగుల పొడవుంది. వెంటనే ఆ ప్రాంతానికి పురాతన జంతుశాస్త్ర పరిశోధకుడు జెఫ్ పెర్సన్ చేరుకుని పరీక్షించారు. అది ఇప్పటికీ పాడవకుండా ఉండటంపట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
👉 – Please join our whatsapp channel here –