Health

ఆంధ్రప్రదేశ్‌లో 108 104 సిబ్బంది సమ్మె సైరన్

ఆంధ్రప్రదేశ్‌లో 108 104 సిబ్బంది సమ్మె సైరన్

ఆంధ్రప్రదేశ్‌లో 108, 104 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. జనవరి 22లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసుల ప్రతులను ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. మొత్తం 7వేల మంది ఉద్యోగులు 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈఎంటీ పోస్టుల భర్తీలో వెయిటేజీ కల్పించాలని కోరారు. ఈ నెల 22 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z