బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఫైటర్’. వార్, పఠాన్ చిత్రాలతో అలరించిన సిద్ధార్థ్ ఆనంద్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ పాట విడుదల చేశారు.ఇప్పటికే ‘ఫైటర్’ మూవీ నుంచి టీజర్, సాంగ్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అలానే అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా ‘హీర్ ఆస్మాని’ అని మరో పాటని రిలీజ్ చేశారు. ఎయిర్‌ఫోర్స్ పైలెట్ లుక్‌లో హృతిక్ రోషన్ వావ్ అనిపిస్తున్నాడు. పాట కూడా వినసొంపుగా ఉంది.
వయాకామ్ 18 స్టూడియోస్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా దీపికా పదుకొనే కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –