Editorials

హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్

హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్

ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ నిర్వహించనున్నట్టు బుక్‌ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. సోమవారం బుక్‌ఫెయిర్‌ కార్యాలయంలో గౌరీశంకర్‌ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో పుస్తక ప్రదర్శన నూతన కార్యదర్శిగా ఆర్‌ వాసు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 36వ బుక్‌ఫెయిర్‌ తేదీలను ఖరారు చేశారు. యేటా జరిగే తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్‌) స్టేడియంలోనే ఉంటుందని చెప్పారు. సమావేశంలో కోశాధికారి పీ రాజేశ్వర్‌రావు, మాజీ కార్యదర్శి శృతికాంత్‌ భారతి, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, కోయ చంద్రమోహన్‌, సహాయ కార్యదర్శి శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z