ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘దేవర’ (Devara). జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్ వస్తుందా? అని ఎదురు చూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. సోమవారం ‘దేవర’ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ఎన్టీఆర్ దర్శనమిచ్చారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
👉 – Please join our whatsapp channel here –