DailyDose

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం- నేర వార్తలు

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం- నేర వార్తలు

* మణిపూర్‌లో మళ్లీ కాల్పులు

మణిపూర్‌ మళ్లీ కాల్పుల మోతతో దద్ధరిల్లింది. సోమవారం భద్రతా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. (Gunfire in Manipur) మణిపూర్‌లోని సరిహద్దు పట్టణమైన మోరేలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో గత రాత్రి నుంచి తుపాకుల మోత మోగుతున్నది. భద్రతా దళాల లక్ష్యంగా తిరుగుబాటుదారులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో అదనపు భద్రతా బలగాలను మోరేకు తరలించారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.కాగా, మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ప్రారంభమైన హింస మరో మలుపు తిరిగిందని ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలపై తిరుగుబాటుదారులు దాడి చేసే పరిస్థితిగా మారిందని చెప్పారు. కొత్త సంవత్సరంలో భద్రతా దళాలు, తిరుగుబాటుదారుల మధ్య హింస జరుగుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య సంఘర్షణ కోణం మారిందని తెలిపారు. తాజాగా తీవ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు పోరాడుతున్నాయని చెప్పారు.

* హైదరాబాద్ పాతబస్తీలో దారుణం

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అన్న కొట్టాడని అలిగి స్వగ్రామం నుంచి హైదరాబాద్ వచ్చిన యువతిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ఇస్ క్రీం ఇచ్చి ఆమెను వారిపై నమ్మకం వచ్చేట్లు నమ్మించారు. తీరా తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి(21) తన తల్లి, సోదరుడితో కలిసి గ్రామంలో నివసిస్తోంది. ఈ నెల 6వ తేదీన యువతి తన అన్నతో ఏదో విషయమై గొడవ పడింది. దీంతో కోపోద్రిక్తుడైన అన్నా యువతిపై చేయి చేసుకున్నాడు. తీవ్రంగా మనస్తాపానికి గురైన యువతి ఇంటినుంచి బయలు దేరి బస్టాండ్ లో హైదరాబాద్ బస్సు ఎక్కింది. శనివారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో ఎంజీబీఎస్‌ బస్టాండ్‌ నుంచి దిగి అఫ్జల్‌గంజ్‌ వైపు నడుచుకుంటూ వెల్తుండగా.. ఒంటరిగా వస్తున్న యువతిని చూసి ములకపెంట శ్రీకాంత్, పానగంటి కాశీవిశ్వనాథ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెంబడించి ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. సమీపంలోని ఏదైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని యువతి చెప్పింది. అక్కడికి వెళ్తున్నామని చెప్పి బైక్‌ ఎక్కించమన్నారు. ఆటోలో వస్తానని యువతి చెప్పినా.. మాయమాటలు చెప్పి బైక్‌పై తీసుకెళ్లారు. అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో ఐస్‌క్రీం తినిపించి తనకి వారిపై నమ్మకం కలిగించారు. అనంతరం బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లేక్‌వ్యూ హిల్స్‌ సమీపంలోని శ్రీకాంత్‌కు చెందిన స్క్రాప్‌ గోడౌన్‌కు తీసుకెళ్లారు.తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని యువతి నిరాకరించడంతో ఆమెను కొట్టి, ఆపై అత్యాచారం చేశారు. మరోచోటికి వెళ్లేందుకు బైక్‌పై తీసుకెళ్తుండగా.. బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తం కావడంతో నిందితులు ఆమెను అక్కడే వదిలి పారిపోయారు. బాధితురాలు స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దారుణం జరిగిన స్క్రాప్ గోడౌన్‌ను పరిశీలించిన పోలీసులు బండ్లగూడ గౌస్‌నగర్ వీకర్ సెక్షన్ కాలనీలో నివసిస్తున్న ములకలపెంట శ్రీకాంత్‌గా గుర్తించారు. వెంటనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. తాను అత్యాచారం చేయలేదని శ్రీకాంత్‌ మొదట పేర్కొన్నాడు. అనంతరం నేరం అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు పానగంటి కాశీవిశ్వనాథ్‌ను కూడా అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యువతిపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారని తేలింది.

* ఫోరం మాల్‌ వద్ద కారు బీభత్సం

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలోని ఫోరం మాల్‌ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్ని అగ్రజ్‌ రెడ్డి అనే యువకుడు ఢీ కొట్టాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాద సమయంలో కారులో అగ్రజ్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేయగా.. నిందితుడు మద్యం మత్తులో వాహనాన్ని నడిపినట్లు తేలింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్రజ్‌.. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి బంధువుగా సమాచారం.

* కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది మహిళ. ఆ మహిళను ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కొండేపూడి జ్యోతిగా గుర్తించారు. అయితే.. ఆ మహిళ ఆత్మహత్యహత్నం కారణం.. ఉప్పే బాపిరాజు అనే వ్యక్తి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.ఈ క్రమంలో.. తనకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చింది. దీంతో.. ఆమే కలెక్టర్ ఆఫీసు వద్ద మహిళ తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. కాగా.. తనపై పెట్టిన తప్పుడు కేసులపై దర్యాప్తు చేసి తనకి న్యాయం చేయాలని బాధిత మహిళ కొండేపూడి జ్యోతి కోరుతున్నారు.

* నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నాగర్‌కర్నూల్‌( Nagarkarnool)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్‌(,RTC bus) ఢీ కొట్టడంతో దంపతులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన పెద్దకొత్తపల్లి మండలం వాయిలబావి గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ట్రాలీ ఆటోలో పాత ఇనుప సామాను తీసుకెళ్తుండగా ఆర్టీసీ బస్ ఆటోను ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే భార్యా భర్తలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* జడ్చర్లలో అమానుషం

మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు.తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్‌ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది.పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్‌ను ట్రాక్‌ చేశారు. హైదరాబాదులోని యాకత్‌పురాలో అతని లోకేషన్‌ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z