తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేపడుతున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వివిధ కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించింది. వారి స్థానాల్లో నూతన నియామకాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 211 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సీఆర్పీలకూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సోమవారం నుంచి విధులకు హాజరుకాని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి గౌరీశంకర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –