మంత్రి ఆర్కే రోజా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అబద్దాలకోరు పార్టీ అని మండిపడ్డారు. ఈరోజు వడమాలపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. అనంతరం వ్యాఖ్యలు చేశారు. గుంపులు గుంపులుగా వచ్చే పార్టీని హైదరాబాద్ కు తరిమి కొట్టండని విమర్శించారు. వాళ్లు అందరూ కూడా నాన్ లోకల్ పొలిటిషియన్స్ అని తెలిపారు. చంద్రబాబుకి, పవన్ కల్యాణ్, లోకేష్ కి ఆంధ్ర ప్రదేశ్ లో సొంత ఇల్లు గానీ, ఓటు గాని లేదని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇప్పుడు స్థానికంగా ఓట్లు పెట్టుకుంటున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ఫ్యామిలీ గానీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గానీ ఏపీలో ఉన్నారా అని మంత్రి రోజా ప్రశ్నించారు. చుట్టపు చూపుగా హైదరాబాద్ నుంచి వచ్చి జగనన్న మీద విషం చిమ్మి.. మమ్మల్ని అందరినీ బూతులు తిట్టడం తప్ప వాళ్ళకి ఏమీ తెలుసు అని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం రాదని మంత్రి పేర్కొన్నారు. జగన్ మాత్రమే ప్రజల మనిషి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి రోజా తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –