ఏపీపీఎస్సీ జారీచేసిన గ్రూపు-1, 2 నోటిఫికేషన్‌లు అనుసరించి దరఖాస్తు చేసేందుకు సర్వర్ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు వెబ్‌సైట్ తెరుచుకోవడం లేదని, మరికొన్ని సార్లు అడిగిన వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేసిన అనంతరం పేమెంట్ విషయంలో ఎర్రర్ మెసేజ్ వస్తోందని చెబుతున్నారు. దీంతో వివరాల నమోదు మళ్లీ మొదటికొస్తోందని వాపోతున్నారు. ఏకకాలంలో అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో సర్వర్ జామ్ అవుతోంది. గ్రూపు-2 దరఖాస్తుల స్వీకరణకు అతి త్వరలో గడువు ముగియనున్న నేపథ్యంలో సాంకేతిక సమస్యలు తొలగించాలని వారు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు. నెట్‌బ్యాకింగ్‌తో పాటు యూపీఐ ద్వారా ఫీజు చెల్లించే సదుపాయాన్ని సైతం కల్పించాలని కోరుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –