పార్లమెంట్ ఎన్నికలకు భాజపా సమాయత్తమవుతోంది. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకు సాధించడమే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్తోపాటు నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపై చర్చించారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపైనా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
👉 – Please join our whatsapp channel here –