స్లీపర్ కోచ్‌లో మిడిల్ బెర్త్‌ల కోసం ఉండే చైన్లు మాయమయ్యాయి. ఇది చూసి రైలు ప్రయాణికులు షాక్ అయ్యారు. దీంతో మిడిల్ బెర్త్‌ల్లో రిజర్వేషన్ పొందిన వారు ఆందోళన చెందారు. (Train Passengers Panic) ఈ విషయాన్ని టీసీ దృష్టికి తీసుకెళ్లారు. చివరకు తర్వాత స్టేషన్‌లో మరో స్లీపర్ కోచ్‌ను ఏర్పాటు చేశారు. ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. పూరీ నుంచి జార్ఖండ్‌లోని హతియాకు వెళ్లే తపస్విని ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాత్రి 8.45 గంటలకు పూరీ నుంచి బయలుదేరింది. అయితే ఎస్-6 కోచ్‌లో మిడిల్ బెర్త్‌ల కోసం ఉండాల్సిన చైన్లు లేకపోవడం చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. మిడిల్ బెర్తుల్లో రిజర్వేషన్ పొందిన వారు రాత్రి ప్రయాణంలో ఎలా నిద్రించాలో అర్థం కాక ఆందోళన చెందారు.
కాగా, ఎస్-6 కోచ్‌లో మిడిల్ బెర్త్‌లు పొందిన ప్రయాణికులు వాటికి చైన్లు లేకపోవడం గురించి టీసీకి తెలిపారు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ రైలు భువనేశ్వర్ స్టేషన్ చేరగా మరో స్లీపర్ కోచ్‌ను అచాట్ చేశారు. ఎస్-6 కోచ్‌లో చైన్లు లేని మిడిల్ బెర్త్‌లు పొందిన ప్రయాణికులకు అదనపు కోచ్‌లో బెర్త్‌లు కేటాయించారు. ఎస్-6 కోచ్‌లో మిడిల్ బెర్త్‌ల చైన్లు మాయం కావడంపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –