ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన ముక్కర భూపాల్‌రెడ్డి కుమారుడు సాయిరాజీవ్‌రెడ్డి (28) అమెరికాలోని టెక్సాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాయిరాజీవ్‌రెడ్డి.. ఓ పార్సిల్ తీసుకోవడానికి తన కారులో విమానాశ్రయానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ ట్రక్కు అదుపు తప్పి ఈ కారును ఢీకొట్టింది. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగానే మృతి చెందారని తెలిసింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇక్కడి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో తండ్రి భూపాల్‌రెడ్డి సోమవారం అమెరికా ప్రయాణమయ్యారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్‌రెడ్డికి వివాహం జరిగింది. మృతుని సోదరి శిల్పారెడ్డి టెక్సాస్‌లోనే నివాసం ఉంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –