DailyDose

సీఏ ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షల ఫలితాలు విడుదల

సీఏ ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షల ఫలితాలు విడుదల

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ICAI) సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ICAI మంగళవారం విడుదల చేసింది. విద్యార్థులు https://icai.nic.in/ వెబ్‌సైట్‌లో తమ రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌లను ఎంటర్‌ చేయడం ద్వారా స్కోరు కార్డులు, మెరిట్‌ జాబితాలను పొందొచ్చు.

సీఏ ఫైనల్‌ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన విద్యార్థులు ఫస్ట్‌, థర్డ్‌ ర్యాంకులతో సత్తా చాటారు. రాజస్థాన్‌కు చెందిన మధుర్‌ జైన్‌ 619/800 మార్కుల (77.38% స్కోరు)తో ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకర్‌గా నిలవగా.. ముంబయికి చెందిన సంస్కృతి అతుల్‌ పరోలియా 599/800 (74.88%) స్కోరుతో రెండో ర్యాంకు; రాజస్థాన్‌కు చెందిన తికేంద్ర కుమార్‌సింఘాల్‌, రిషి మల్హోత్ర 590/800 మార్కుల (73.75%)తో మూడో ర్యాంకుతో మెరిశారు. అలాగే, సీఏ ఇంటర్‌లో ముంబయికి చెందిన జయ్‌ దేవంగ్‌ జిములియా 86.38శాతం స్కోరుతో తొలి ర్యాంకు సాధించగా.. ఆ తర్వాతి ర్యాంకుల్లో అహ్మదాబాద్‌కు చెందిన భగేరియా తనయ్‌ (86శాతం), సూరత్‌కు చెందిన రిషి హిమాన్షు కుమార్‌ మేవావాలా (83.50శాతం) నిలిచారు.

సీఏ ఇంటర్‌ ఇంటర్మీడియట్‌ కోర్సు గ్రూప్‌-1 పరీక్షలు నవంబర్‌ 2, 4, 6, 8 తేదీల్లో జరగ్గా.. గ్రూప్‌- 2 నవంబర్‌ 10, 13, 15, 17 తేదీల్లో నిర్వహించారు. అలాగే, సీఏ ఫైనల్‌ విద్యార్థులకు గ్రూప్‌-1 నవంబర్‌ 1, 3, 5, 7 తేదీల్లో; గ్రూప్‌ 2ను నవంబర్‌ 9, 11, 14, 16 తేదీల్లో నిర్వహించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z