తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు.
‘‘టీఎస్‌పీఎస్సీకి ఛైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. నెలరోజులుగా ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు ఆమోదించలేదు. ఇలా అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. ఛైర్మన్ లేకపోవడం వల్ల పరీక్షల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. టీఎస్‌పీఎస్సీలో అవకతవకలు జరిగాయి. నియామకాల విషయంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కమిషన్‌లో జరిగిన తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –