ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్ బృందాన్ని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు సూచనలు చేశారు.. కేంద్ర ఎన్నిక సంఘం ప్రతినిధుల కలసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను అన్నారు.. అంతేకాదు.. పోలింగ్ రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం అన్నారు. మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు పాల్.. కాపులందరూ బయటకు రావాలని పిలుపునిచ్చారు.. పవన్ కల్యాణ్‌కి నా పర్సనల్ రిక్వెస్ట్.. వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవద్దు అని సూచించారు.
ఇక, నా ఆరోగ్యం బాగానే ఉంది.. నా మీద విష ప్రయోగం చేసినా.. దేవుని కృపతో.. వైద్యుల సహాయంతో బయటపడ్డాను అన్నారు కేఏ పాల్.. నా మీద విష ప్రయోగానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కాగా, ఈ మధ్యే తనపై విష ప్రయోగం జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించిన విషయం విదితమే.. ఎవరో కావాలని నన్ను చంపాలని ఫుడ్ పాయిజన్ చేశారన్న ఆయన.. వైజాగ్ లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నానని ఈ మధ్యే వెల్లడించిన విషయం విదితమే.. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. అయితే, ఎవరు ఫుడ్ పాయిజన్ చేశారో పోలీసులు కనిపెట్టాలని కేఏ పాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –