చంచల్‌గూడ జైలులో ఓ ఖైదీ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అతని కడుపులో మేకులు, టేపు చుట్టలు ఇతర వస్తువులు ఉన్నాయని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కడుపు నొప్పితో బాధపడుతున్న ఖైదీ ఎండీ.సొహైల్(21)ను చంచల్‌గూడ జైలు ఎస్కార్టు పోలీసులు ఈ నెల 8న ఉస్మానియాలో చేర్పించారు. జనరల్ సర్జరీ యూనిట్-7 వైద్యులు ఎక్స్‌రే తీసి పరిశీలించగా.. రెండు మేకులు, షేవింగ్ బ్లేడు ఇతర చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు బి.రమేశ్‌కుమార్ ఎండోస్కోపీతో విజయవంతంగా బయటకు తీశారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.బి.నాగేందర్ తెలిపారు. అయితే ఆ వస్తువులను ఎప్పుడు, ఎందుకు మింగాడనే విషయాన్ని ఖైదీ వెల్లడించడం లేదు.
👉 – Please join our whatsapp channel here –