రూపాయికే చీర ఇస్తామని ఆఫర్ ప్రకటించడంతో వస్త్ర దుకాణానికి మహిళలు పోటెత్తారు. భద్రాచలంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ఉన్న ఓ షాపు యజమాని ఈ మేరకు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి మహిళలు అధిక సంఖ్యలో వస్త్ర దుకాణం వద్దకు చేరుకున్నారు. ఆలస్యంగా దుకాణం తెరవడంతో.. స్త్రీలు ఒక్కసారిగా షాపు లోనికి దూసుకెళ్లారు. వారందరినీ బయటికి నెట్టేసి దుకాణాన్ని మూసివేశారు.
👉 – Please join our whatsapp channel here –