Business

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు

సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆరు రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య జనవరి 10 నుంచి 15 తేదీల్లో సర్వీసులందించనున్నాయి.

ప్రత్యేక రైళ్ల వివరాలివే..
తిరుపతి – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07055) జనవరి 10వ తేదీన రాత్రి 8.25గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.10గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది.

సికింద్రాబాద్‌ -కాకినాడ టౌన్‌ రైలు (07056) జనవరి 11వ తేదీన రాత్రి 7గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 6.45గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే, కాకినాడ టౌన్‌ -సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07057) 12వ తేదీ రాత్రి 9గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు సికింద్రాబాద్‌ చేసుకోనుంది.

సికింద్రాబాద్‌- కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు (07071) జనవరి 13వ తేదీన రాత్రి 9గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.

కాకినాడ టౌన్‌ – తిరుపతి ప్రత్యేక రైలు (07072) జవనరి 14న ఉదయం 10గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.20గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

తిరుపతి -కాచిగూడ ప్రత్యేక రైలు (02707) జనవరి 15న తెల్లవారుజామున 5.30గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z