Food

చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తించిన ఘటన

చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తించిన ఘటన

చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తించిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. సమీపంలోని పాన్‌ డబ్బాల యజమానులు గత కొద్దిరోజులుగా విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తున్నారు. అవి తినడంతో తరగతి గదిలో మత్తులోకి జారడంతో పాటు వింతగా ప్రవర్తించారు. గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చాక్లెట్లు తినడంతోనే విద్యార్థులు అలా ప్రవర్తించారని గుర్తించారు. పాన్‌ డబ్బాల యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z