Politics

మేడిగడ్డపై విజిలెన్స్ విచారణకు ఆదేశం

మేడిగడ్డపై విజిలెన్స్ విచారణకు ఆదేశం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వ్యవహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ జలసౌధలోని కాళేశ్వరం కార్పొరేషన్‌ కార్యాలయంలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి, మహాదేవ్‌పూర్‌లో సాగునీటి డివిజన్‌ కార్యాలయాల్లో మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో 10 ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌ బృందాలు పాల్గొన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z