త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం గుంటూరులో ఘనంగా జరిగింది. చిత్రయూనిట్ అంతా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. గుంటూరులో మొదటిసారి ఈ రేంజ్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడంతో మహేష్ అభిమానులతో పాటు అనేకమంది ప్రజలు వచ్చారు.
ఇప్పటికే గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతబెట్టి.., దమ్ మసాలా, ఓహ్ మై బేబీ సాంగ్స్.. అభిమానులని, ప్రేక్షకులని మెప్పించగా తాజాగా మావా ఎంతైనా.. అంటూ ఎమోషనల్ తో పాటు మాస్ గా సాగే సాంగ్ విడుదల చేశారు. దీంతో ఎలాంటి టైం చెప్పకుండా సడెన్ గా సాంగ్ రిలీజ్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మావా ఎంతైనా.. అంటూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది పాట. ఇక ఈ సాంగ్ లో కూడా మహేష్ మాస్ స్టెప్పులు అదరగొట్టేశాడు. ఇప్పటిదాకా వచ్చిన పాటల్లో శ్రీలీల కనిపిస్తే ఈ పాటలో మీనాక్షి కనిపించి మెప్పించింది.
👉 – Please join our whatsapp channel here –