త్వరలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. సచివాలయంలో ఆ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చర్చించి సమగ్ర పాలసీ రూపొందించనున్నట్లు చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
2014 నుంచి జరిగిన విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ ధర చెల్లించడానికి గల కారణాలు తెలపాలన్నారు. ప్రస్తుతం సరైన విధానం లేనందునే పలు సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. తక్కువ ధరకు ఇచ్చే కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. విద్యుత్ దుర్వినియోగం అరికట్టాలని.. నిరంతర సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల విద్యుత్ విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
👉 – Please join our whatsapp channel here –