గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాలకి చెందిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గణేష్ కందుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన కార్యవర్గానికి ఈ రోజు ఎన్నికలు జరిగాయి. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్ జీవన్ యేనుగ, కార్యదర్శి గా హరీష్ బొడ్డున, కోశాధికారిగా సురేష్ రుద్రరాజు , సాంస్కృతిక కార్యదర్శిగా బాలకృష్ణ గరిపల్లి భారీ మెజారిటీ తో గెలిచారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రెసిడెంట్ గణేష్.. రిచ్మండ్ తెలుగు కమ్యూనిటీ లో సర్వీసెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారని అసోషియేషన్ సభ్యులు తెలిపారు.
అసోసియేషన్ ప్రెసిడెంట్ గణేష్ మాట్లాడుతూ తన సొంత నిధులతో ఖమ్మం లో కాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు, నిరుపేదలకు దుప్పట్లు , కరోనా సమయంలో నిత్యావసర సరుకులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. తమపై నమ్మకంతో ఈ అవకాశం రిచ్మండ్ తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. అందరినీ కలుపుకుని సంస్థ అభ్యున్యతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులకీ పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
👉 – Please join our whatsapp channel here –